పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చ
ఢిల్లీ, 24 మార్చి (హిం.స):వాషింగ్టన్: పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస
వ్యాపార వీసా


ఢిల్లీ, 24 మార్చి (హిం.స):వాషింగ్టన్: పర్యాటక, వ్యాపార వీసాలతో అమెరికాకు వచ్చినవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని అమెరికా తీపి కబురు అందించింది. ఉద్యోగంలో చేరేముందే ఆ వీసాను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బీ1 వీసాను వ్యాపార పనుల మీద వచ్చిన వారికి, బీ2 వీసాను పర్యాటకులకు అమెరికా జారీ చేస్తుంటుంది. ఆ దేశ తాజా నిర్ణయంతో ఈ రెండు వీసాల కేటగిరీలవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికా వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) బుధవారం ఈ వివరాలను వెల్లడించింది. టెక్ అగ్ర సంస్థల్లో ఇటీవల భారీగా ఉద్యోగాల కోతతో వేలాది మంది విదేశీయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ లేఆఫ్ల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నవారు 60 రోజుల వ్యవధిలో మరో ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. వీరు అప్పటికే ఉద్యోగం సంపాదిస్తే అమెరికాలో ఉండవచ్చు. లేదంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ ఆందోళనల నడుమ.. ఉద్యోగం వెతుక్కునేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయంటూ బుధవారం టూరిస్టు, బిజినెస్ వీసాలకు సంబంధించి యూఎస్సీఐఎస్ వరుస ట్వీట్లు చేసింది. ‘60 రోజుల్లో ఉద్యోగం రానివారు దేశం విడిచి వెళ్లాలన్న అంశాన్ని కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వారికి అనేక మార్గాలున్నాయని పేర్కొంది.

హిందుస్థాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande