సరుకు రవాణాలో చరిత్రను సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 9 (హిం స) 2018-19 ఆర్థిక సం II లో సాధించిన 122.498 మిలియన్ టన్నుల ల
సరుకు రవాణాలో చరిత్రను సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 9 (హిం స) 2018-19 ఆర్థిక సం II లో సాధించిన 122.498 మిలియన్ టన్నుల లోడింగ్ ను అధిగమించి 8 మార్చి 2023 నాటికి 122 .628 మిలియన్ టన్నుల అత్యుత్తమ సరుకు రవాణాను సాధించిన దక్షిణ మధ్య రైల్వే_ జోన్ ప్రారంభమైనప్పటి నుండి సరకు రవాణాలో అత్యుత్తమ సరుకు రవాణా ఆదాయం చేరుకొని , తద్వారా ఆదాయం రూ. 12 ,016 కోట్లు ఆర్జి దక్షిణ మధ్య రైల్వే యొక్క సరుకు రవాణా లో తన మెరుగైన పనితీరు వల్ల వృద్ధిపథం వైపు పురోగమిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జోన్ సాధించిన అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్ను 8 మార్చి 2023 నాటికి అధిగమించింది .

2018-19 ఆర్థిక సం II మొత్తంలో నమోదైన 122.498 మిలియన్ టన్నులను సరకు రవాణాను అధిగమించి 122.628 మిలియన్ టన్నుల సరుకు రవాణాను సాధించడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక నూతన శిఖరాన్ని అధిరోహించింది . జోన్ ప్రారంభమైనప్పటి నుండి సరకు రవాణా ఆదాయం లో అత్యుత్తమ పనితీరు నమోదు చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో 8 మార్చి 2023 నాటికి రూ. 12 ,016 కోట్ల రాబడి ఆర్జించింది .

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, సరకు రవాణాలో వినూత్న ( టారీఫ్ మరియు నాన్ టారిఫ్ పరంగా ) చర్యల ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తోంది . సరుకు రవాణాను సులభంగా , మరియు వేగవంతముగా అలాగే మరింత సులభతరం చేయడానికి సరకు రవాణా టెర్మినల్స్పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీనితో పాటు సరకు రవాణా సజావుగా సాగేందుకు ముఖ్యమైన గూడ్స్ షెడ్ల వద్ద మెరుగైన స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి . ఈ చర్యల చేపట్టడం మూలాన జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యుత్తమ సరుకు రవాణాను సాదించేందుకు దోహదపడింది . గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన సరుకు రవాణా పోల్చితే అన్ని రైల్వే జోనల్ లలో దక్షిణ మధ్య రైల్వే రెండవ స్థానాన్ని చేరుకొంది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం సరుకు రవాణా 12% అధికం . వస్తువుల రవాణా పరంగా, బొగ్గు మొత్తం లోడింగ్కు 62.195 మిలియన్ టన్నులు అందించడం ద్వారా అతిపెద్ద విభాగంగా కొనసాగుతోంది. దీని తర్వాత 31 .883మిలియన్ టన్నుల సిమెంట్ లోడ్ అవుతోంది.

ఇతర ప్రధాన వస్తువులు: ఆహార ధాన్యాలు: 6.731 ఎం టి లు; ఎరువులు: 7.516 ఎం టి లు; ఆర్ ఎం ఎస్ పి : 4.181 ఎం టి లు; ఇనుప ఖనిజం:1.45 ఎం టి లు మరియు కంటైనర్లు, పెట్రోలియం ఉత్పత్తులు (పి.ఓ .ఎల్ ) మరియు ఇతర వస్తువుల లోడింగ్ కలిపి 8 .672 ఎం టి ల లోడింగ్ జర దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా విభాగంలో - లోడింగ్ మరియు రాబడి రెండింటి పరంగా అత్యుత్తమ పనితీరును సాధించినందుకు సిబ్బంది చేసిన కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.

హిందుస్థాన్ సమాచార/ రాజీవ్


 rajesh pande