నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ భారత నేవీ టార్పిడో
విశాఖపట్నం 06,జూన్( హిం.స) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడో ను నేవీ మంగళవారం పరీక్
నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ భారత నేవీ టార్పిడో


విశాఖపట్నం 06,జూన్( హిం.స) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన భారీ టార్పిడో ను నేవీ మంగళవారం పరీక్షించింది. నీటిలోపల ఉన్న లక్ష్యాన్ని ఈ టార్పిడో విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నేవీ ట్విటర్లో పోస్ట్ చేసింది.

‘‘నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డీఆర్డీవో సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన హెవీ వెయిట్ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశాం. ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్తులో మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనం’’ అని నేవీ రాసుకొచ్చింది. అయితే ఈ టార్పిడో పేరును గానీ.. ఇతర ఫీచర్లను గానీ నౌకాదళం ఇప్పుడే బయటపెట్టలేదు. హిందూ మహా సముద్రంలో చైనా కారణంగా ముప్పు పెరుగుతున్న వేళ.. నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande