అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు-దేవెగౌడ
బెంగళూరు, 06,జూన్( హిం.స)రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పై జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ ప్ర
devegowda


బెంగళూరు, 06,జూన్( హిం.స)రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పై జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా పని చేస్తున్నారంటూ కితాబునిచ్చారు. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్ వినిపిస్తున్న డిమాండ్ను ఆయన కొట్టిపారేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన దేవెగౌడ.. జరిగిన నష్టం నుంచి ట్రాక్స్ను పునరుద్ధరించేందుకు రైల్వే మంత్రి అన్ని చర్యలు తీసుకున్నారని అన్నారు. అశ్విని వైష్ణవ్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, మంత్రిగా అశ్విని వైష్ణవ్ తన బాధ్యతను, తన సత్తా ఏంటో చాటుకున్నారని ఇలాంటి దశలో రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం సరైన పని కాదని అన్నారు. ప్రమాదంపై విచారణ పూర్తి చేయనివ్వాలని దేవెగౌడ అన్నారు.

రైలు ప్రమాద ఘటనకు బాధ్యతగా రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వే శాఖ మంత్రికి మాజీ ప్రధాని దేవెగౌడ వెన్నుదన్నుగా నిలవడం ఆసక్తిగా మారింది. ఇది కచ్చితంగా విపక్షాలకు షాకింగ్ అని చెప్పాలి. మరో వైపు ఈ ప్రమాదం ఘటన కేసును సీబీఐకి అప్పగించడంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande