ఏపిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లెక్చరర్స్ డిమాండ్
అమరావతి,7జూన్: (హిం.స)తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ఏ
ఏపిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లెక్చరర్స్ డిమాండ్


అమరావతి,7జూన్: (హిం.స)తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలని ఏపీ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసును మాత్రమే రెగ్యులర్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సుముఖత తెలపడం దారుణమని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేష్, కార్యదర్శి కె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande