హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)
ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక
పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ హయాంలో విచ్చలివిడిగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారిపై ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు, వీడియోలు పెట్టిన వారిపై చాలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫిర్యాదుల ఆధారంగా చేసుకొని.. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై కేసు నమోదైంది. గతంలో ఆయన తీసిన వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి ని కించపరిచేలా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని.. మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని తెలిపారు. ఆర్జీవీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..