దేశవ్యాప్తంగా జమిలి .ఎన్నికల  పై.చర్చ
విజయవాడ, 23 నవంబర్ (హి.స.): దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్‌ ముందుకు వెళ్తోంది.. జమిలి ఎన్నికలే వస్తే.. 2027లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.. అయితే
 దేశవ్యాప్తంగా జమిలి .ఎన్నికల  పై.చర్చ


విజయవాడ, 23 నవంబర్ (హి.స.): దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్‌ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్‌ ముందుకు వెళ్తోంది.. జమిలి ఎన్నికలే వస్తే.. 2027లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు.. పార్లమెంట్‌, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా.. అవి షెడ్యూల్‌ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..

ఇక, విజన్‌-2047ను కింది స్థాయి వరకూ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.. మరోవైపు.. వైఎస్‌ జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనే అంశంపై న్యాయ సలహా తీసుకుని స్పందిస్తాం అన్నారు.. విజన్ 2047 కోసం నిధుల సమీకరణకు వినూత్న పంథాలో ముందుకు వెళ్తామని చెప్పారు.. కాలేజీలు, విశ్వవిద్యాలయాల వంటి వేదికలపై చర్చిస్తాం. ఈ విజన్‌ ద్వారా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో అన్ని వర్గాలవారికీ తెలియడానికి ప్రణాళిక రూపొందించుకుని పనిచేయనున్నట్టు వెల్లడించారు.. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి క్వార్టర్‌, ప్రతి ఏడాదికి లక్ష్యాలు పెట్టుకుని సాధించడానికి ప్రయత్నిస్తామన్నారు.. అయితే, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమావేశం అనంతరం.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం.. ఇరిగేషన్, నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను కూడా చంద్రబాబు రిలీజ్ చేసారు.. దానిలోనూ కేంద్ర అనుసంధాన

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande