జయమంగళ.వెంకట రమణ వైసిపికి నేడు.రాజీనామా
విజయవాడ, 23 నవంబర్ (హి.స.) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు
 జయమంగళ.వెంకట రమణ వైసిపికి నేడు.రాజీనామా


విజయవాడ, 23 నవంబర్ (హి.స.)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుంది. గత ఐదేళ్ల జగన్ పాలన దృష్ట్యా ఏపీలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి ఆ పార్టీ నేతలు వస్తున్నారట. అందుకే.. పక్క చూపులు చూస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు. ఇక కొందరు నేతలైతే అసలు పార్టీలో ఉన్నారో, లేదో కూడా తెలియడం లేదు. పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు వైసీపీకి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొంతమంది కూడా రాజీనామాల బాట పట్టనున్నట్లు సమాచారం. తాజాగా జయ మంగళ వెంకటరమణ ఇవాళ(శనివారం) రాజీనామా చేశారు. గత కొంత కాలంగా వైసీపీపై, పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి వైఖరీని బాహాటంగానే నేతలు విమర్శిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande