హైదరాబాద్, 23 నవంబర్ (హి.స.)
*హైదరాబాద్, నవంబర్ 22:* గ్రేటర్ వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే అందరి సమన్వయంతో విజవంతంగా జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే ముమ్మరంగా, సమర్థవంతంగా సాగుతున్నది.
పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న సర్కిల్ లో ఎన్యుమరేటర్ల పై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎన్యుమరేటర్ బ్లాక్ లో సర్వే పూర్తయిన నేపథ్యంలో వారికి పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న బ్లాక్ లకు కేటాయించి ఇంటింటి సర్వే ను పూర్తి చేయాలన్నారు. పూర్ ఫిర్మరెన్స్ ఎన్యూమరేటర్ లకు సర్వే లో నిర్దేశించిన ఇళ్లను ఎక్కువ మొత్తంలో కాకపోవడానికి కారణాలు తెలుసుకొని వాటిని వెంటనే నివృత్తి చేయాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సర్వే లో డేటా ఎంట్రీ కూడా కొనసాగించాల్సి ఉంటుందని, డేటా ఎంట్రీ కి ప్రతి సర్కిల్ కు ఇద్దరు చొప్పున శిక్షణ ఇచ్చి మాస్టర్ ట్రైన్ గా పరిగణించి ఏజెన్సీ ద్వారా వచ్చేవ్ఆపరేటర్ లకు శిక్షణ ఇచ్చే విధంగా తయారు చేయాలని ఐటీ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో గ్రేటర్ లో ఎల్బీనగర్ జోన్ లో ఎక్కువ శాతం, సికింద్రాబాద్ జోన్ తక్కువ శాతం సర్వే పూర్తి చేస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా శుక్రవారం 67.51 శాతం కుటుంబ సర్వే పూర్తి కాగా నేడు 1,20,153 కుటుంబాలు సర్వే కాగా, ఇప్పటి వరకు 16,37,563. సర్వే పూర్తి చేసారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు