విజయవాడ, 23 నవంబర్ (హి.స.)ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు. జగన్ వ్యక్తిత్వ హననం చేయని రోజూ చంద్రబాబు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. పనామా లీక్స్, పారడైస్ పేపర్స్ అంటూ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా.. జగన్ను ప్రజలు సీఎం చేశారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల