హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)
విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో
పాటు మెరుగైన విద్యను అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మోడల్ స్కూల్ ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్లో ఉన్న వంట గదిలో వండిన ఆహార పదార్థాలను, హాస్టల్లో నిలువ ఉంచిన సరుకులను, త్రాగు నీటిని కలెక్టర్ పరిశీలించారు. వివిధ వార్డులలో జరుగుతున్నటు వంటి ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించి,సర్వేలో అధికారులు చేయాల్సిన పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ఆర్మూర్ ఎమ్మార్వో గజానన్, సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వార్డ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్