హైదరాబాద్, 11 డిసెంబర్ (హి.స.)చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రేలను ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు