రెండు వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో 52 మంది దుర్మ‌ర‌ణం.. ఆఫ్గనిస్తాన్ లో ఘటన
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.) రెండు వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో 52 మంది దుర్మ‌ర‌ణం పాలైన విషాద ఘ‌ట‌న ఆప్ఘనిస్థాన్‌లో జరిగింది. మరో 76మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కాందహార్ హైవేపై గత రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొం
ఆఫ్ఘనిస్తాన్ లో రోడ్డు ప్రమాదాలు


హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)

రెండు వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో 52 మంది దుర్మ‌ర‌ణం పాలైన విషాద ఘ‌ట‌న ఆప్ఘనిస్థాన్‌లో జరిగింది. మరో 76మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబూల్-కాందహార్ హైవేపై గత రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే హైవేపై మరో ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తంగా 52మంది మృతిచెందారు. గాయపడిన 76మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్న కారణంగా అక్కడ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande