గుజరాత్ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం
పోర్బందర్ 28 ,ఫిబ్రవరి (హిం.స)అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేద
గుజరాత్ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం


పోర్బందర్ 28 ,ఫిబ్రవరి (హిం.స)అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను భారత నౌకాదళం ఛేదించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో)తో జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా 3,300 కేజీల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్ చేసింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు.

మంగళవారం అనుమానాస్పదంగా భారత జలాల్లోకి ప్రవేశించిన ఒక చిన్నపాటి నౌకను గుర్తించిన అధికారులు వెంటనే దానిని ముట్టడించారు. దాని నుంచి 3089 కేజీల చరాస్, 158 కేజీల మెథామెఫ్తమైన్, 25 కేజీల మార్ఫిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. వారంతా పాకిస్థాన్ జాతీయులు. ఆ మేరకు నౌకాదళం ప్రకటన విడుదల చేసింది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande