లోక్పాల్ ఛైర్పర్సన్గా జస్టిస్ ఖాన్విల్కర్
దిల్లీ 28 ,ఫిబ్రవరి (హిం.స) అవినీతి నిరోధక అంబుడ్స్మన్- లోక్పాల్కు ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న
 జస్టిస్‌ ఖాన్విల్కర్‌


దిల్లీ 28 ,ఫిబ్రవరి (హిం.స) అవినీతి నిరోధక అంబుడ్స్మన్- లోక్పాల్కు ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖాన్విల్కర్ నియమితులయ్యారు. జుడిషియల్ సభ్యులుగా హిమాచల్ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లింగప్ప నారాయణస్వామి, అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్యాదవ్, ప్రస్తుతం లా కమిషన్ ఛైర్మన్గా ఉన్న కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి నియమితులయ్యారు. నాన్ జుడిషియల్ సభ్యులుగా కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ సుశీల్చంద్ర, పంకజ్కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ టిర్కీ నియమితులయ్యారు. లోక్పాల్ తొలి ఛైర్పర్సన్గా జస్టిస్ పినాకి చంద్రఘోష్ 2019 మార్చి 23 నుంచి 2022 మే 27వరకు ఉన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande