. గుజరాత్లోని వడోదర టికెట్ ను 33 ఏళ్ల వయసున్న హేమాంగ్ జోషికి
, 2బెంగళూరు19,ఏప్రిల్ (హిం.స) పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని సొంత రాష్ట్ర మైన గుజరాత్ లో బీజీపీ మరో య
. గుజరాత్లోని వడోదర టికెట్ ను 33 ఏళ్ల వయసున్న హేమాంగ్ జోషికి


, 2బెంగళూరు19,ఏప్రిల్ (హిం.స) పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని సొంత రాష్ట్ర మైన గుజరాత్ లో బీజీపీ మరో యువ నాయకుడికి సీటు ఖరారు చేసింది. గుజరాత్లోని వడోదర టికెట్ ను 33 ఏళ్ల వయసున్న హేమాంగ్ జోషికి కేటాయించింది. జోషీ హోలీ సందర్భంగా ఓ సంగీత కార్యక్రమానికి హాజరవుతుండగా..ప్రముఖులు ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో వడోదర స్థానానికి బీజేపీ తనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని అతడికి తెలిసింది. అసలు ఏమైందంటే..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర స్థానానికి బీజేపీ సిట్టింగ్ ఎంపీగా రంజన్ భట్ ఉన్నారు. రెండుసార్లు ఈ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికైన ఆమెకు ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సీటు కేటాయించారు. కాని రంజన్ భట్ వ్యక్తి గత కారణాలతో ఉన్నపలంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఆలోచనలో పడ్డ పార్టీ అగ్రనాయకులు మాజీ విద్యార్థి నాయకుడు, 33 ఏళ్ల యువకుడైన జోషికి టికెట్ కేటాయించారు. రాష్ట్రంలో 26 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థల్లో పిన్న వయస్కుడు జోషీనే.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande