వయనాడ్‌లో రాహుల్ గెలుపుపై మోడీ సంచలన వ్యాఖ్యలు
, 2) బెంగళూరు19,ఏప్రిల్ (హిం.స) దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రా
వయనాడ్‌లో రాహుల్ గెలుపుపై మోడీ సంచలన వ్యాఖ్యలు


, 2) బెంగళూరు19,ఏప్రిల్ (హిం.స) దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శనివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో రాహుల్‌ను వయనాడ్ నుంచి కూడా ప్రజలు తరిమికొడతారని వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి మరో లోక్‌సభ స్థానాన్ని చూసుకోవల్సిందేనని ప్రధాని జోస్యం చెప్పారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. రాహుల్ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని.. తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని విమర్శలు గుప్పించారు. మొదటి దశ పోలింగ్‌లో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు. అమేథీలో గతంలో ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు.. వయనాడ్‌లోనూ ఓడిపోనున్నారు. విపక్ష ఇండియా కూటమికి చెందిన కొందరు నేతలు లోక్‌సభను వదిలి రాజ్యసభకు వెళ్లిపోతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. వారికి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదన్నారు. గత కాంగ్రెస్ హయాంలో జరిగిన పాలనా పరమైన సమస్యలు చక్కదిద్దేందుకు పదేళ్లు పట్టిందని.. దేశానికి ఇంకా ఎంతో చేయాల్సింది ఉందని తెలిపారు. ఇండియా కూటమి అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికి కలిసి వచ్చిన స్వార్థపరుల గుంపు అని మోడీ ధ్వజమెత్తారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande