సురేష్ కుమార్ కు రెవెన్యూ. శాఖలో గ్రేడ్ 1 డిప్యూటీ తహశీల్దార్ గా నియమిస్తున్నారు
అమరావతి, 1 నవంబర్ (హి.స.):మావోయిస్టుల దాడిలో మరణించిన నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురే‌ష్ కుమార్‌కు రెవెన్యూ శాఖలో గ్రేడ్‌-1 డిప్యూటీ తహసీల్దార్‌గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018, సెప
సురేష్ కుమార్ కు రెవెన్యూ. శాఖలో గ్రేడ్ 1 డిప్యూటీ తహశీల్దార్ గా నియమిస్తున్నారు


అమరావతి, 1 నవంబర్ (హి.స.):మావోయిస్టుల దాడిలో మరణించిన నాటి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుమారుడు సురే‌ష్ కుమార్‌కు రెవెన్యూ శాఖలో గ్రేడ్‌-1 డిప్యూటీ తహసీల్దార్‌గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018, సెప్టెంబరు 28న నాటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా ఉన్న సివేరి సోమలను మావోయిస్టులు హత్యచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. సర్వేశ్వరరావు, సివేరి సోమ కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించారు. సర్వేశ్వరరావుకు ఇద్దరు కుమారులు కాగా, చిన్నకుమారుడిని అప్పట్లోనే డిప్యూటీ కలెక్టర్‌గా నియమించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande