
న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)
భారత దేశ రాజధాని ఢిల్లీలో గత
దీపావళి పండుగకు వారం ముందు నుంచి వాయు కాలుష్యం (Air pollution) తీవ్ర స్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ, పంజాబ్, హర్యానాలో పంటలు కాల్చడంతో ఈ ప్రభావం మరింత పెరిగింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్న పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 5వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలు హైబ్రిడ్ మోడ్లో (ఆన్లైన్ + ఆఫ్లైన్) బోధన కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే, తల్లిదండ్రుల సౌకర్యాన్ని బట్టి విద్యార్థులు ఆన్లైన్ - పాఠశాలకు హాజరయ్యే విధంగా అవకాశం కల్పించాలని సూచించింది. ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) తీవ్ర స్థాయిలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు