రామ్‌చరణ్‌ పెద్ది సినిమా చికిరి పాటపై రామ్ గోపాల్ వర్మ ఉహించని స్పందన
అమరావతి, 11 నవంబర్ (హి.స.) టాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పెద్ది సినిమా (Peddi movie) నుంచి ఇటీవల రిలీజ్ అయిన పెద్ది సినిమా సాంగ్ దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించిన చిక
ram-gopal-varmas-unexpected-reaction-to-the-song-chikiri-from-ram-charans-peddi-movi


అమరావతి, 11 నవంబర్ (హి.స.)

టాలీవుడ్ ఇండస్ట్రీలో కీలక హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పెద్ది సినిమా (Peddi movie) నుంచి ఇటీవల రిలీజ్ అయిన పెద్ది సినిమా సాంగ్ దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందించిన చికిరి చికిరి అనే సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో చేరిన విషయం తెలిసిందే. దీంతో రామ్ చరణ్ కు నార్త్ లో కూడా భారీగా క్రేజ్ పెరిగిపోయింది. అయితే బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడుతున్నాడు.

ఇదిలా ఉంటే చికిరి సాంగ్ విజయంపై టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఉహించని విధంగా స్పందించారు. ఆయన మంగళవారం తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. సినిమాలో ప్రతి కళారూపం దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ వంటి ప్రతి విభాగం అసలైన ఉద్దేశ్యం హీరోను మెరుగుపరచడమే. చాలా కాలం తర్వాత రామ్‌చరణ్‌ తన అసలైన, సహజమైన, అద్భుతమైన రూపంలో కనిపించాడు. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటలో చరణ్‌ నటన, ఆవేశం, ఎనర్జీ తాను ఎంతో కాలం తర్వాత చూసిన అత్యుత్తమ రూపం అని రామ్ గోపాల్ వర్మ ప్రశంసించాడు.

అలాగే పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు (Director Buchibabu)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఒక స్టార్‌ తన చుట్టూ అతి తళుకుబెళుకుల మధ్య కాదు, సహజత్వంతో ఉన్నప్పుడే అత్యంత ప్రకాశిస్తాడు. నువ్వు ఆ విషయం అద్భుతంగా అర్థం చేసుకున్నావు. భారీ సెట్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, వందల మంది డ్యాన్సర్ల మధ్య కాకుండా, అసలు దృష్టి హీరో పైనే నిలిపావు” అని రామ్ గోపాల్ వర్మ బుచ్చిబాబును ప్రశంసించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande