
అమరావతి, 12 నవంబర్ (హి.స.)
:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం వైసీపీ (YCP) ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. వైసీపీ నిరసన ర్యాలీపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పీపీపీ (PPP) అంటే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యమని స్పష్టం చేశారు. అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని కూటమి నేతలు తేల్చిచెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ