గులాబీ బాస్ కు బిగ్ రిలీఫ్.. ‘కాళేశ్వరం'పై మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.) తెలంగాణ హైకోర్టు లో మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకొవద్దని మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్లో పాటు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చ
కెసిఆర్ కు రిలీఫ్


హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)

తెలంగాణ హైకోర్టు లో మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ లభించింది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకొవద్దని మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మిత సబర్వాల్లో పాటు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్సింగ్, న్యాయమూర్తి జీఎం మోయిద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. అదేవిధంగా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేసేందుకు గాను 4 వారాల పాటు గడువు, ప్రభుత్వ కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు నలుగురు పిటిషనర్లకు మరో మూడు వారాల పాటు టైమ్ ఇచ్చింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande