
సంగారెడ్డి, 12 నవంబర్ (హి.స.)
ఢిల్లీ పేలుళ్లపై కొందరు దుష్ప్రచారం
చేస్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అసహనం వ్యక్తం చేశారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని, బాంబు పేలుళ్లతో బీజేపీకి ఏం సంబంధం అంటూ ఫైరయ్యారు. ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం కూడా దేశద్రోహం కిందికే వస్తుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టర్ వరకూ నిర్వహించిన సర్దార్ -ఏక్తా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. బాంబు పేలుళ్ల వెనుక బీజేపీ ఉందంటూ వస్తోన్న పోస్టుల్ని తీవ్రంగా ఖండించారు.
ఎన్నికలు వస్తే బ్లాస్టులు జరుగుతున్నాయంటూ కొందరు సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలుళ్లకు కారణమైన వారి వెనుక బీజేపీ ఉందని ఎవరైతే మాట్లాడుతున్నారో.. ఈ వ్యాఖ్యల్ని వారి విజ్ఞతకేవదిలేస్తున్నామన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఎవరూ సమర్థించవద్దని కోరారు. నిజానికి బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని, ఇప్పుడు ఆ నెపాన్ని తమపై రుద్దుతున్నారని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..