కవిత ఫ్లెక్సీలు తొలగించిన వారి పై మంత్రి కోమటిరెడ్డి సీరియస్.. ఎందుకు చేశారంటూ ఆగ్రహం
నల్గొండ, 12 నవంబర్ (హి.స.) తెలంగాణ జాగృతి ఫ్లెక్సీలను ఎవరు తొలగించమన్నారు, ఎందుకు తొలగించారు.. ఎవరి సంఘం వాళ్ళది.. ఎవరి ప్రచారం వాళ్ళది.. మీకేం అవసరం.. వాటిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది.. తొలగించమని చెప్పిందెవరు.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంక
మంత్రి కోమటిరెడ్డి


నల్గొండ, 12 నవంబర్ (హి.స.)

తెలంగాణ జాగృతి ఫ్లెక్సీలను

ఎవరు తొలగించమన్నారు, ఎందుకు తొలగించారు.. ఎవరి సంఘం వాళ్ళది.. ఎవరి ప్రచారం వాళ్ళది.. మీకేం అవసరం.. వాటిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది.. తొలగించమని చెప్పిందెవరు.. అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కమిషనర్ తో పాటు పోలీసు అధికారుల పై ఫైర్ అయ్యారు. బుధవారం ఇందిరా భవన్లో అధికారులను మంత్రి నిలదీశారు. ఎవరు రాజకీయాలు వాళ్ళని చూసుకోనివ్వాలి.. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుంటాం.. ఒకరి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు మనకి ఎక్కడిది.. అంటూ ఒకింత గట్టిగానే మందలించారు. మీరు చేసిన తప్పిదం వల్ల మిగతా వాళ్ళతో నేను మాటలు పడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande