
న్యూఢిల్లీ, 12 నవంబర్ (హి.స.)
ఢిల్లీ పేలుడు బాధితులను ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్న మోడీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్( ఎల్ఎన్సీపీ) ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యం గురించి క్షతగాత్రులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 16 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..