
నల్గొండ, 12 నవంబర్ (హి.స.)
గంజాయి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి 37,500 రూపాయల విలువగల 1.5 కేజీల గంజాయిని, మూడు సెల్ ఫోన్లు, రెండు పల్సర్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డిఎస్పి శివరామిరెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం విస్తృత తనిఖీలో భాగంగా ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేతేపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని సమాచారం రాగా కేతేపల్లి ఎస్సై తన సిబ్బందితో కలిసి ఇప్పలగూడెం గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు మోటార్ సైకిల్లపై ఆరుగురు వ్యక్తులు గుడివాడ గ్రామం నుండి కేతేపల్లి వైపు వస్తుండగా పోలీసులను చూసి ఒక మోటార్ సైకిల్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోగా మిగతా వారిని మోటారు సైకిళ్ళతో కలిపి పట్టుబడి చేసి విచారించినట్లు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు