
తిరుపతి:, 12 నవంబర్ (హి.స.)ర్యాగింగ్ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడు)పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ కొత్తగా యూనివర్సిటీలో అడుగు పెట్టిన విద్యార్థులను భయపెట్టకుండా స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యత అని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ