'ఇకనైనా అహంకారం తగ్గించుకుంటే బెటర్'.. జూబ్లీహిల్స్ ఫలితాలపై CM రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కు సరైన ఫలితాలు రాలేదు.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్పై క్రమంగా నమ్మకం పెరుగుతోందని అన్నారు. గెలుపోటములకు కాంగ్రెస్ ఎప్పుడూ కుంగిపోదు.. పొంగిపోదు అని చెప్పారు. ప్రజల తరపున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం అని అన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి.. జూబ్లీహిల్స్లో తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ నేతలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోందని.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వాళ్లం పోషిద్దామని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande