
న్యూఢిల్లీ, 14 నవంబర్ (హి.స.)
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే
కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి భారీ లీడ్ లో ఉందని, కారణాలు వివరంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. ఈ ఓటమిలో మొత్తం కూటమి పనితీరుని పరిశీలించుకొని, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతైనా
ఈ ఫలితాలు తనను తీవ్రంగా నిరాశ పరిచాయని, తనను ఎన్నికల ప్రచారానికి పిలిచి ఉంటె పరిస్థితి మెరుగ్గా ఉండేదని అన్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే NDA కూటమి రాష్ట్రంలోని మహిళలకు కొన్ని ప్రోత్సాహకాలు అందించిందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..