సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు
మంచిర్యాల, 14 నవంబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారుల ఆకస్మిక తనికి సంచలనం సృష్టించింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ మధు నేతృత్వంలోని అధికారుల బృందం సబ్ రిజిస్టర్ కార్యాలయా
మంచిర్యాల సబ్ రిజిస్టర్


మంచిర్యాల, 14 నవంబర్ (హి.స.)

మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారుల ఆకస్మిక తనికి సంచలనం సృష్టించింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ మధు నేతృత్వంలోని అధికారుల బృందం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి చేరుకుంది.ఒకసారిగా కార్యాలయం లోపలికి వెళ్లి డాక్యుమెంట్లు పరిశీలించడంతో పాటు.. రిజిస్ట్రేషన్ జరుగుతున్న ప్రక్రియను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మధు మీడియాతో మాట్లాడుతూ... ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వసాధారణంగా తనిఖీ చేయడానికి వచ్చామని వెల్లడించారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇతర శాఖలకు సంబంధించిన అంశాలను కూడా చెక్ చేయడానికి వచ్చామని చెప్పారు.

డాక్యుమెంట్ రైటర్ల పరార్..!

ఏసీబీ బృందం వచ్చిందన్న సమాచారం తెలిసిన వెంటనే అక్కడి డాక్యుమెంట్ రైటర్లు ఒక్కసారిగా దుకాణాలను బంధ్ చేసి పారిపోయడం కలకలం రేపింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న 33 మంది డాక్యుమెంట్ రైటర్లు తక్షణమే దుకాణాలు మూసివేసి పరారయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande