హైటెక్స్లో ఫుడ్ ఎ ఫేర్ ను ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.) దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆహార-పానీయ ( ఫుడ్ అండ్ బేవరేజ్) ట్రేడ్ ఫెయిర్గా గుర్తింపు పొందిన ఫుడ్ ఎ ఫేర్ 2025 నగరంలోని హైటెక్స్లో ఏర్పాటయింది. ఈ ఫెయిర్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి డి. శ్
మంత్రి దుద్దిల్ల


హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)

దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆహార-పానీయ ( ఫుడ్ అండ్ బేవరేజ్) ట్రేడ్ ఫెయిర్గా గుర్తింపు పొందిన ఫుడ్ ఎ ఫేర్ 2025 నగరంలోని హైటెక్స్లో ఏర్పాటయింది. ఈ ఫెయిర్ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, ఆధునిక, స్థిరమైన, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చే ఫుడ్ ఎకోసిస్టమ్ను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, పారిశ్రామిక వేత్తల అభివృద్ధి, టెక్నాలజీ అనుసరణ, మార్కెట్ అభివృద్ధి వంటి కీలక రంగాల్లో దృష్టి సారించడం ద్వారా, ఆహార వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా నిలపడమే తమ లక్ష్యం అని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande