బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం
అమరావతి, 14 నవంబర్ (హి.స.) విశాఖపట్నం: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలో బిహార్‌లో ఎన్డీయే గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి  అఖండ విజయం


అమరావతి, 14 నవంబర్ (హి.స.)

విశాఖపట్నం: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలో బిహార్‌లో ఎన్డీయే గెలుపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో సీఎం ప్రసంగిస్తూ బిహార్‌ ఫలితాలను ప్రస్తావించారు. బిహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ విజయం సాధించిందన్నారు. ఎన్డీయేపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత్‌లో ప్రధాని మోదీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని సీఎం వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande