
ముంబై, 14 నవంబర్ (హి.స.)
ఇవాళ (శుక్రవారం) ఉదయం నుంచి
నష్టాల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్ సూచీలు ఆఖరి అరగంటలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఒక్కసారిగా లాభాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పీఎస్ఈూ బ్యాంక్ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. దాంతో పీఎస్ఈయూ బ్యాంక్ ఇవాళ ఏకంగా 1.17 శాతం లాభపడింది.
అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలకు కలిసొచ్చింది. ఇవాళ ట్రేడింగ్ మొదలవగానే మెటల్, ఐటీ షేర్ లు భారీగా పడిపోవడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. ఒకానొక దశలో 84,029 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయిన బీఎస్ఈ సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 84,562 పాయింట్ల గరిష్ఠానికి చేరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..