
హైదరాబాద్, 14 నవంబర్ (హి.స.)
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలోపడి చచ్చింది అనే సామెత మాదిరి తయారైంది. జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా పని చేసి, వారు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రచించారు ప్రశాంత్ కిషోర్. ఇక తాను స్వయంగా రాజకీయాల్లోకి దిగి జన సూరజ్ పార్టీ స్థాపించి బిహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా కనీసం ఆధిక్యాన్ని కూడా కనబరచలేకపోతోంది. మొత్తం 243 స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ సహా.. ఏ ఒక్క చోట కూడా జన సూరజ్ పార్టీ ఓట్లు సాధించ లేకపోయింది. అందరికీ స్ట్రాటజీలు ప్లే చేసే పీకే తన విషయం వచ్చేసరికి చతికిల పాపం అంటున్నారు రాజకీయ పడిపోయాడు విమర్శకులు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..