
విశాఖపట్నం, 14 నవంబర్ (హి.స.)బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బిహార్ ప్రజలు మరోసారి విశ్వాసం చూపించారని ఉద్ఘాటించారు. మోదీపై ప్రజలు విశ్వాసం ఉంచారనడానికి బిహార్‌లో వస్తున్న ఫలితాలే నిదర్శనమని నొక్కిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయని.. ప్రజలు భారీ విజయం అందిచబోతున్నారని జోస్యం చెప్పారు.
ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో పీయూష్ గోయల్ పాల్గొని ప్రసంగించారు. ఎన్డీఏ కూటమి 181 సీట్లు సాధించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు పీయూష్ గోయల్.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV