టీటీడీ పరకామణి చోరీ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి..!
అనంతపురం, 14 నవంబర్ (హి.స.) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో కీలక పాత్ర పోషించిన మాజీ ఏవీఎస్వో (అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్) సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని క
re-in-the-ttd-parakamani-theft-case-dies-under-suspicious-circumstances-4


అనంతపురం, 14 నవంబర్ (హి.స.) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో కీలక పాత్ర పోషించిన మాజీ ఏవీఎస్వో (అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్) సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌పై సతీష్‌కుమార్ మృతదేహం లభ్యమైంది.

పరకామణి చోరీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు నవంబర్ 6న సతీష్‌కుమార్‌ను విచారించారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. సతీష్ కుమార్ అనుమానాస్పద మృతితో కేసు మరింత ప్రతిష్టాత్మకంగా సీఐడీ అధికారులు తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande