30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభ
విశాఖపట్టం, 14 నవంబర్ (హి.స.) పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. ఈ సదస్సును ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు
s 1.1 Lakh Crore Brookfield Investment in Mega Gre


విశాఖపట్టం, 14 నవంబర్ (హి.స.) పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది.

ఈ సదస్సును ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు, సహా, గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌గోయల్‌, రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆహానించాలనే లక్ష్యంగా ఈ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇదీలా ఉండగా ఇటీవలే రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడు పలు కంపెనీలు ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకోగా తాజాగా మరో కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకుస్తున్న మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ అనే సంస్థ రూ.లక్షా పది వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని ఆయన ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇది మరో భారీ పెట్టుబడిగా నిలవబోతుందిని ఆయన రాసుకొచ్చారు. ఈ బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థ పునరుత్పాదక విద్యుత్‌, బ్యాటరీ, పంప్డ్‌ స్టోరేజ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన తెలిపారు. వీటితో పాటు రియల్‌ఎస్టేట్‌, బీసీసీలు, ఇన్‌ఫ్రా, పోర్టుల్లోనూ ఏపీకి పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande