
యాదాద్రి భువనగిరి, 2 నవంబర్ (హి.స.)
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. చెరువులో ఎగిరి పడి యువతి కూడా మృతి చెందింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ఓ వ్యక్తి కూడా చనిపోయారు.
కారు అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొట్టడంతో అందులో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భువనగిరి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు