
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి గెలుపు కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ (ఆదివారం) ఉదయం బీజేపీ, కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్క్ లో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్తో ముచ్చటించారు. నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్తో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్ తో పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి అన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడు నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి, మీ సమస్యలపై మీకు అండగా ఉండే వ్యక్తిని గెలిపించాలని వాకర్స్ను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..