
గోదావరిఖని, 6 డిసెంబర్ (హి.స.)
బ్లాక్ డే సందర్భంగా గోదావరిఖని పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం వారు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పారిశ్రామిక నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాలలో పోలీసులు అడుగడుగునా సోదాలు జరిపారు.
గోదావరిఖని బస్టాండ్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, లక్ష్మీ నగర్ వ్యాపార సముదయాలలో, రమేష్ నగర్, అడ్డగుంట పల్లితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా సోదా చేశారు. అదేవిధంగా నిత్యం రద్దీగా ఉండే దుకాణ సముదాయాల ప్రాంతాల్లో నిలిచి ఉన్న వాహనాలను బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు