
హైదరాబాద్, 6 డిసెంబర్ (హి.స.)చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కార్యాలయాన్ని, జగన్ భారతి సిమెంట్స్‌ను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్
సూచించారు. ప్రధానమంత్రి నద్రమోదీ, సీఎం చంద్రబాబులది రాజకీయ స్నేహం మాత్రమేనని.. వారి మనస్సులు ఎప్పుడూ కలవవని విమర్శించారు.
ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ వర్ధంతి అని తెలిపారు. ప్రభుత్వానికి అపరిమిత హక్కులు కల్పించి ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు దేశానికి పతనం మొదలవుతోందని అంబేడ్కర్ చెప్పారని గుర్తుచేశారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాత ఆర్ఎస్ఎస్‌లో నుంచి తాను బయటకు వచ్చానని స్పష్టం చేశారు. హిందూమతంపై 1964లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారని ప్రస్తావించారు. హిందుత్వం అనేది మతం కాదని.. సనాతన ధర్మమని వివరించారు. బీజేపీ నేతలు రాజకీయం కోసం హిందూ మతాన్ని వాడుకుంటున్నారని విమర్శలు చేశారు. నార్త్ తరహాలో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదని పేర్కొన్నారు. భారత్‌లో అమాయకుల జోలికి వచ్చే పాకిస్థాన్ టెర్రరిస్టులను కాల్చి పడేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు