కేంద్రమంత్రి బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానం
కరీంనగర్, 6 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ''తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్''కు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో చైతన్యపురి మహాశక్తి ఆలయంలో బండిని కలిస
Bandi Sanjay


కరీంనగర్, 6 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న 'తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్'కు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రంలో చైతన్యపురి మహాశక్తి ఆలయంలో బండిని కలిసిన పొన్నం అధికారికంగా ఆహ్వానం అందజేశారు. హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande