రామచందర్ రావుతో విభేదాలు లేవు.. క్లారిటీ ఇచ్చిన అరవింద్
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.) బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. రామచందర్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రామచందర్ రావు తనకు బడ్డీ బ్రదర్ లాంటి వాడని చెప్
ఎంపీ అరవింద్


హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)

బీజేపీ అధ్యక్షుడు రామచందర్

రావుతో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. రామచందర్ రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రామచందర్ రావు తనకు బడ్డీ బ్రదర్ లాంటి వాడని చెప్పారు. ఆయన తనకు స్నేహితుడి లాంటివాడని, పెద్దన్నలాంటి వాడు అని చెప్పారు. ఒకసారి తాను మాట్లాడుతూ రామచందర్ రావు ఫిర్యాదులు ఇవ్వనివ్వకండి అనబోయి, ఇవ్వకండి అని అన్నానని ఒక ఛానల్ దానిని ప్రచారం చేసిందన్నారు. రామచందర్ రావు అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande