నాకాబందీ తనిఖీలు ఎఫెక్ట్.. 25 శాతం వరకు తగ్గిన మొబైల్ స్నాచింగ్లు..
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.) సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నాకా బందీ తనిఖీలు మంచి ఫలితాలను ఇస్తుంది. గత 3 నెలలుగా సైబరాబాద్ పరిధిలో ప్రారంభమైన ఈ నాకా బందీతో 25 శాతం మొబైల్ స్నాచింగ్ల
పోలీస్ తనిఖీలు


హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్

పరిధిలో పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న నాకా బందీ తనిఖీలు మంచి ఫలితాలను ఇస్తుంది. గత 3 నెలలుగా సైబరాబాద్ పరిధిలో ప్రారంభమైన ఈ నాకా బందీతో 25 శాతం మొబైల్ స్నాచింగ్లు తగ్గిపోయాయని పోలీసు లెక్కలు చెప్పుతున్నాయి. రాత్రి సమయాల్లో నాకా బందీతో దాదాపు 400 మంది పోలీసు అధికారులు రోడ్ల పై కనపడుతుండడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో వణుకు పుట్టిస్తుంది. సైబరాబాద్ పరిధిలో ప్రతి రోజు ఏదో ఒక చోట నాకా బందీని నిర్వహిస్తున్నారు. మొబైల్, చైన్ స్నాచింగ్లతో బైక్ రేసింగ్లు కూడా తగ్గిపోయింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande