
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన
వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదని అన్నారు. కేంద్రమంత్రిగా హైదరాబాద్, తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ బీజేపీకి ప్రజలు డిపాజిట్ రాకుండా చేశారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా 80శాతం హామీలు అమలు చేశామన్నారు. మూడేళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. హిల్ట్ పాలసీ పేరుతో మరో భూదందాకు తెరలేపారని అన్నారు.
తొమ్మిది వేల ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా జీవో తీసుకువచ్చి ఇష్టా రీతిన వ్యహరిస్తోందని మండిపడ్డారు. కాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు