
హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్ వెస్ట్ జోన్ పంజాగుట్ట
పరిధిలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిని బెదిరించడానికి ప్రయత్నించిన యూట్యూబ్ ఛానల్స్ కు చెందిన ఐదుగురు వ్యక్తుల పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా స్కై ఫ్లై అనే యూ ట్యూబ్ న్యూస్ ఛానెల్ ప్రతినిధిని అరెస్ట్ చేసి కోర్టులో హజరు పరిచి జైలుకు తరలించారు. కాగా రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన వెంచర్ పై తప్పుడు వీడియోలు సృష్టించి తమ ఛానల్ లో ప్రచురిస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నుండి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించగా బాధితులు పోలీసులను ఆశ్రయించాడు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు