హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్
అమరావతి, 7 డిసెంబర్ (హి.స.) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హిందువులను మతమార్పిడి చేస్తున్నారు అంటూ ఓ యూట్యూబర్ చేసిన వీడియోను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాకుండా హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి


అమరావతి, 7 డిసెంబర్ (హి.స.)

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. హిందువులను మతమార్పిడి చేస్తున్నారు అంటూ ఓ యూట్యూబర్ చేసిన వీడియోను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాకుండా హిందూ మతంపై కుట్రలు సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. డబ్బు ఆశచూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటివారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దామని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు.

దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. అదే భారతదేశానికి రక్ష.. శ్రీరామ రక్ష అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నారు. ఆయన జగన్ హయాంలో ఆయన ఎంపీగా పనిచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande