
గోవా, 7 డిసెంబర్ (హి.స.)
గోవాలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ( Goa CM Pramod Sawant ) కీలక ప్రకటన చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాసేపటికి క్రితమే అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనకు చేరుకున్న గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మీడియాతో మాట్లాడారు. అర్పోరా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 23 మంది మరణించినట్లు ఆయన ధ్రువీకరించారు. ఇందులో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యాటకులు మృతి చెందినట్లు తెలిపారు.
క్లబ్ లో సేఫ్టీ రూల్స్ పాటించలేదని ప్రాథమికంగా సమాచారం అందిందని వెల్లడించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మృతి చెందిన కుటుంబాలు, క్షతగాత్రులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని పేర్కొన్నారు. కాగా పర్యాటక రాష్ట్రం గోవా ఆర్పోరా ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో వెంటనే అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు. రంగంలోకి ఫైర్ ఇంజన్లు కూడా దిగాయి. ఇక ఈ సంఘటనలో మృతి చెందిన వాళ్లను స్థానిక మెడికల్ కాలేజీకి పంపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV