ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్
అమరావతిా, 7 డిసెంబర్ (హి.స.) నిడదవోలు (Nidadavole) నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యుడు కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) ప్రత్యేక చొరవ తీసుకుంటున
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కందుల దుర్గేష్


అమరావతిా, 7 డిసెంబర్ (హి.స.)

నిడదవోలు (Nidadavole) నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, స్థానిక శాసనసభ్యుడు కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నేరుగా ప్రజలను కలిసి వారి నుంచి వినతులను స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. మంత్రి వద్ద తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారం చూపించాలని కోరారు. వ్యక్తిగత, సామాజిక సమస్యల వంటివి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. భూ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల లోపాలు, వివిధ రకాల సమస్యల గురించి తెలిపారు. వాటికి పరిష్కారం చూపించి తమకు, తమ ప్రాంతానికి న్యాయం చేయాలని ప్రజలు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande