ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదు : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు, 7 డిసెంబర్ (హి.స.) ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemi Reddy Prabhakar Reddy) అన్నారు. అందుకే విపిఆర్ ఫౌండేషన్ (VPR Foundation) ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్ర
ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదు : ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి


నెల్లూరు, 7 డిసెంబర్ (హి.స.)

ప్రతిభకు అంగవైకల్యం అడ్డు రాకూడదనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemi Reddy Prabhakar Reddy) అన్నారు. అందుకే విపిఆర్ ఫౌండేషన్ (VPR Foundation) ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. ఈ మేరకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ పంపిణి చేస్తున్నామని తెలిపారు. తమ కార్యక్రమంలో భాగంగా ఉచిత ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ పంపిణీని నెల్లూరు సిటీలో నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులు కార్యక్రమానికి తరలివచ్చారు. వారికి మంత్రి నారాయణతో కలిసి ఉచిత ఎలక్ట్రిక్ ట్రై సైనిల్స్ ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వారితో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande